ప్రపంచంలో 14 ఎత్తయిన పర్వతాలలో 9 శిఖరాలను అధిరోహించిన తొలి భారతీయుడిగా కర్నూలు జిల్లాకు చెందిన భరత్ తమ్మిశెట్టి రికార్డు సృష్టించారు. 8,188 మీటర్ల ఎత్తులో ఉన్న చో ఓ యు శిఖరాన్ని అధిరోహించడం ద్వారా ఈ విజయాన్ని సాధించారు. 2017లో ఎవరెస్టుతో మొదలుపెట్టి, 2025లో ధవళగిరి శిఖరం వరకు ఆయన జెండా ఎగురవేశారు. ఈ 9 శిఖరాలన్నీ 8 వేల మీటర్ల కంటే ఎక్కువ ఎత్తయినవి కావడం విశేషం. మిగిలిన శిఖరాలు పాకిస్థాన్ భూభాగంలో ఉండటం వలన భారతీయులకు ప్రవేశం లేదు.