భారత్‌లో అమెరికా తర్వాత అతిపెద్ద ఏఐ పవర్ హౌస్ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇందుకోసం వచ్చే ఐదేళ్లలో $15 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెడుతుంది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో ఏపీ ప్రభుత్వం, గూగుల్ ఒప్పందం చేసుకున్నాయి. ఏపీ సీఎం చొరవకు, ప్రధాని మోదీ నాయకత్వానికి ఈ ఒప్పందం నిదర్శనమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రధాని మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.