హైదరాబాద్‌లోని హయత్‌నగర్ పీఎస్ పరిధి, పెద్ద అంబర్‌పేట్‌లో దొంగలు బీభత్సం సృష్టించారు. సాయిసార్వ గెటెడ్ కమ్యూనిటీలో ఏకంగా రెండు ఇళ్లలో చోరీ జరిగింది. దొంగలు సెంట్రల్ లాక్ డోర్లను బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించారు. ఈ చోరీలో 5 కేజీల వెండి, 35 గ్రాముల బంగారం, సుమారు రూ.60 వేల నగదు, విలువైన చీరలను ఎత్తుకెళ్లారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.