భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ కాల్ కోసం, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు గాజా కాల్పుల విరమణపై జరుగుతున్న ముఖ్యమైన కేబినెట్ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. గాజా శాంతి ఒప్పందం పురోగతిపై మోదీ నేతన్యాహుకు అభినందనలు తెలిపారు. బందీల విడుదల, గాజా ప్రజలకు మానవతా సహాయం అందించేందుకు కుదిరిన ఒప్పందాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదని మోదీ స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య స్నేహం మరింత బలంగా ఉంటుందని ఇద్దరు నేతలు పునరుద్ఘాటించారు.