భారత్‌తో ఆర్థిక భాగస్వామ్యానికి ఎలాంటి ముప్పు లేదని వియత్నాం విదేశాంగ మంత్రి బూయ్ థాన్ సన్ అన్నారు. ఆయన మాట్లాడుతూ భారత్ వియత్నాం కీలక భాగస్వామి అని, రెండు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, విద్యా, ఆరోగ్య రంగాల్లో బలమైన సంబంధాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రత్యేకంగా పెట్టుబడులు, వాణిజ్యం పెరుగుతున్నాయని చెప్పారు. డిసెంబరులో వియత్నాం అధ్యక్షుడు భారత పర్యటన చేపడతారని ప్రకటించారు. ఈ పర్యటన రెండు దేశాల వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని చెప్పారు. భారత్‌తో ఉన్న బంధం భవిష్యత్తులో కూడా మరింత బలపడుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.