భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు ఓటమికి ప్రధాన కారణం కెప్టెన్ సల్మాన్ అఘానేనని మాజీ పేసర్ షోయబ్ అక్తర్ తీవ్రంగా విమర్శించాడు. అతడు తీసుకుంటున్న నిర్ణయాలు అసలు అర్థమవుతున్నాయా? అని ప్రశ్నించాడు. ముఖ్యంగా భారీ స్కోరు చేయాల్సిన కీలక సమయంలో ముందుగా బ్యాటింగ్‌కు రాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. జట్టులో అతడే అత్యంత బలహీనమైన ఆటగాడని వ్యాఖ్యానించాడు. తన నిర్ణయాల వల్లే జట్టు ఒత్తిడిలో పడిందని విమర్శించాడు. అభిమానులు కూడా కెప్టెన్ వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన నాయకత్వం ఉంటే పరిస్థితి మారేదని అక్తర్ అభిప్రాయపడ్డాడు.