గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ , బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘ఉప్పెన’ ఫేమ్ సానా బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి వృద్ది సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. విలేజ్ స్పోర్ట్స్ రివేంజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్ ఆడియన్స్‌ని విశేషంగా ఆకట్టుకున్నాయి. చరణ్‌తో పాటు మెగా ఫ్యాన్స్ కూడా ‘పెద్ది’పై చాలా ఆశలు పెట్టుకున్నారు. పాన్‌ఇండియా రేంజులో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలోని క్యాస్టింగ్‌పైనా బుచ్చిబాబు ఫోకస్ పెట్టాడు.