ఆసియాకప్ 2025లో భారత్ చేతిలో పాకిస్థాన్ జట్టు చిత్తుగా ఓడిపోవడాన్ని ఆ జట్టు మాజీ క్రికెటర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ జట్టు ఓడిపోయిందనే బాధలో.. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. చాలా మంది తమ జట్టు సరిగ్గా ఆడలేదని అంగీకరిస్తున్నారు. కానీ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహమ్మద్ యూసుఫ్ మాత్రం విమర్శల పాలయ్యే వ్యాఖ్యలు చేశాడు. భారత్ చేతిలో ఓటమి, ఆపై షేక్ హ్యాండ్ విషయంలో పరువు పోగొట్టుకోవడాన్ని తట్టుకోలేక టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పై అభ్యంతకర వ్యాఖ్యలు చేశాడు.