ఆసియా కప్ ఆరంభ మ్యాచ్‌లో అఫ్ఘనిస్తాన్ ఆల్‌రౌండర్ అజ్మతుల్లా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. క్రీజులో కాసేపు ఉన్నా హాంకాంగ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. తక్కువ స్కోర్‌కే పరిమితం అవుతుంది అనుకున్న జట్టుకు భారీ స్కోర్ అందించాడు. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్ఘనిస్తాన్ ఒక దశలో తడబడినప్పటికీ, అజ్మతుల్లా 21 బంతుల్లో 53 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోరును అందించాడు. బౌలింగ్‌లోనూ రాణించి ఒక వికెట్ తీశాడు. దీంతో అఫ్ఘనిస్తాన్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
Azmatullah Omarzai Asia Cup: అజ్మతుల్లా ఆ బాదుడేంది బాసూ.. టీ20 మజా అంటే ఇదీ! హాంకాంగ్‌కి హడల్ పుట్టించాడుగా!!
Published on: 11-09-2025