ఆసియా కప్ 2025 అబుదాబీ వేదికగా జరగనున్న అప్ఘనిస్తాన్, హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమవ్వనుంది. టీ20 ప్రపంచ కప్ 2026కు సన్నాహకంగా ఆసియా ఖండంలోని జట్లు తమ ఆటగాళ్లను ఎంపిక చేసుకున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ ఫేవరెట్‌గా ఉంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభమన్ గిల్ వైస్ కెప్టెన్‌గా భారత జట్టు బరిలోకి దిగుతోంది. పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా నాయకత్వం వహిస్తున్నాడు. అప్ఘన్ కెప్టెన్‌గా రషీద్‌కు బాధ్యతలు అప్పగించారు.
Asia Cupలో పాల్గొనే ఎనిమిది జట్ల స్క్వాడ్స్ ఇవే.. ఈసారి ఫేవరెట్ మాత్రం డిఫెండింగ్ ఛాంపియన్సే!
Published on: 09-09-2025