దేశంలోనే

దేశంలోనే అతిపెద్ద గణనాథుడు ఆంధ్రప్రదేశ్‌లోనే.. 126 అడుగుల భారీ విగ్రహం, గిన్నిస్ రికార్డ్ కోసం!

Published on: 28-08-2025

ఆంధ్రప్రదేశ్‌లో ఘనంగా వినాయక చవితి నవరాత్రోత్సవాలు ప్రారంభం అయ్యాయి. ఈ సందర్భంగా దేశంలోనే అతిపెద్ద మట్టి వినాయక విగ్రహాన్ని తాజాగా అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఏకంగా 126 అడుగుల ఎత్తైన భారీ గణేషుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి.. ఇవాళ పూజలు జరిపించారు. ఈ విగ్రహం గిన్నిస్ బుక్‌లో చోటు దక్కించుకుంటుందని నిర్వాహకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విగ్రహ నిర్మాణానికి ఏకంగా రూ.70 లక్షలు ఖర్చయినట్లు సమాచారం.

Sponsored