రైల్వే

రైల్వే ప్రయాణికులు బీ అలర్ట్.. డబ్బులు, బంగారం జాగ్రత్త..!

Published on: 28-08-2025

నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించే వారిని దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఏకంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసిన దుండగులు.. రైలు ఆగగానే అందులోకి ప్రవేశించి.. మహిళల వద్ద ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లిపోయారు. అయితే నిజమైన బంగారం అనుకుని.. ఓ మహిళ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నగలను కూడా దొంగలు చోరీ చేయడం గమనార్హం. రెడ్ సిగ్నల్ వచ్చేలా చేసి.. రైలు ఆగిన తర్వాత అందులోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.

Sponsored