ఇంగ్లాండ్‌తో మాంచెస్టర్ వేదికగా జరుగుతోన్న నాలుగో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 114.1 ఓవర్లలో 358 పరుగులకు ఆలౌట్ అయింది. ఓవర్ నైట్ స్కోరుకు మరో 94 పరుగులు జోడించి.. ఆరు వికెట్లు కోల్పోయింది. తొలి రోజు ఆటలో గాయపడ్డ రిషభ్ పంత్.. కుంటుతూనే క్రీజులోకి వచ్చాడు. హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో బెన్ స్టోక్స్ ఐదు వికెట్లు పడగొట్టాడు. జోఫ్రా ఆర్చర్ మూడు వికెట్లు తీశాడు.