మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న ఐపీఎల్ 2026 సీజన్ నేపథ్యంలో క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పెరుగుతోంది. ఈ క్రమంలో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై ఆయన పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.
డిఫెండింగ్ ఛాంపియన్స్‌గా బరిలోకి దిగుతున్న ఆర్సీబీ ఈసారి కూడా టైటిల్ సాధిస్తుందని డివిలియర్స్ అభిప్రాయపడ్డాడు. గతంలో ఈ జట్టు ఎన్నోసార్లు ట్రోఫీకి చేరువగా వెళ్లి కూడా విఫలమైనప్పటికీ, ఇప్పుడు పరిస్థితులు మారాయని ఆయన అన్నారు. జట్టులో పోరాటస్ఫూర్తి ఉన్న ఆటగాళ్లు ఉన్నారని, అందరూ ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా విరాట్ కోహ్లీ గురించి మాట్లాడిన డివిలియర్స్, ఈసారి జట్టు బాధ్యత మొత్తం ఆయనపై ఉండదని చెప్పారు. ఇతర ఆటగాళ్లు కూడా సమానంగా బాధ్యత తీసుకుంటారని, జట్టుగా బలంగా నిలుస్తారని అన్నారు. ఇదే ఆర్సీబీ విజయానికి కీలకమని అభిప్రాయపడ్డారు.
డ్రెస్ింగ్ రూమ్‌లో విరాట్ కోహ్లీ తరచుగా చెప్పే మాటలను కూడా డివిలియర్స్ గుర్తుచేశాడు. ఒకసారి ట్రోఫీ గెలిస్తే వరుసగా మరిన్ని టైటిళ్లు సాధించగలమని కోహ్లీ చెప్పేవాడని తెలిపారు. ఆ మాటలపై తాను నమ్మకం ఉంచినట్లు పేర్కొన్నారు. ఆర్సీబీ వరుసగా రెండు లేదా మూడు టైటిళ్లు గెలిచే సామర్థ్యం కలిగిన జట్టుగా మారిందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఆర్సీబీ జట్టులో పెద్దగా మార్పులు ఉండకపోయినా, అదే జట్టు మరింత అనుభవంతో, ధైర్యంతో ఈసారి బరిలోకి దిగుతుందని అన్నారు. జట్టులో యువ ఆటగాళ్లు, అనుభవజ్ఞులు కలిసిన సమతుల్యత ఉందని చెప్పారు.
ఈ వ్యాఖ్యలు ఆర్సీబీ అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపాయి. ఎన్నాళ్లుగానో ట్రోఫీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు డివిలియర్స్ మాటలు కొత్త ఆశలను రేకెత్తిస్తున్నాయి. ఈసారి ఆర్సీబీ నిజంగా టైటిల్ సాధిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఆర్సీబీపై ఏబీ డివిలియర్స్ నమ్మకం.. ఈసారి కప్ మనదే?
10
Published on: 📅 19 Mar 2026, 12:23 PM
Reporter: 🖊 Kiran Rao