dhurandhar 2 creates booking storm crosses 130 crore before release

‘ధురంధర్‌ 2’ బుకింగ్స్ సునామీ.. రిలీజ్‌కే ముందే రూ.130 కోట్లు

6

Published on: 📅 18 Mar 2026, 12:24 PM
Reporter: 🖊 Kiran Rao

భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న ‘ధురందర్ 2’ బాక్సాఫీస్ వద్ద మరోసారి కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు సిద్ధమైంది. రణవీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు దర్శకుడు ఆదిత్య ధర్. విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డులు బద్దలవుతున్నాయి.

మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం, కేవలం అడ్వాన్స్ సేల్స్ ద్వారానే వంద కోట్ల క్లబ్‌లోకి చేరడం విశేషం. ప్రివ్యూల ద్వారానే సుమారు రూ.40.54 కోట్లు వసూలయ్యాయని సినీ వర్గాలు వెల్లడించాయి. మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌లో మరో రూ.29 కోట్లు రాగా, ఓవర్సీస్ మార్కెట్‌లో సుమారు రూ.60 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదైనట్లు సమాచారం. ఈ విధంగా సినిమా విడుదలకు రెండు రోజుల ముందే మొత్తం రూ.130 కోట్ల మార్క్‌ను దాటినట్లు తెలుస్తోంది.

దేశవ్యాప్తంగా సుమారు 15,000 థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు దాదాపు 4.7 లక్షల టికెట్లు అమ్ముడవడం ఈ సినిమాపై ఉన్న క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.

దాదాపు 3 గంటల 55 నిమిషాల నిడివి ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా సెన్సార్ వివరాలు వెలువడాల్సి ఉంది. ఉగాది సందర్భంగా విడుదలవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ రికార్డులు సృష్టించే అవకాశముందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Sponsored