ugadi box office clash ustaad bhagat singh vs dhurandhar 2

ఉగాది బాక్సాఫీస్ వార్.. పవన్ ‘ఉస్తాద్’ Vs రణ్‌వీర్ ‘ధురంధర్ 2’

7

Published on: 📅 16 Mar 2026, 11:57 AM
Reporter: 🖊 Ramesh Kumar

వేసవి సినిమా సీజన్ ప్రారంభం కాబోతుండగా ఈసారి ఉగాది సందర్భంగా బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొననుంది. పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్‌సింగ్ మరియు రణ్‌వీర్ సింగ్ హీరోగా తెరకెక్కిన ధురంధర్ ది రివెంజ్ ఒకే రోజు విడుదల కానుండటంతో అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

పవన్ కల్యాణ్ హీరోగా దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్‌సింగ్ గతంలో బాక్సాఫీసు వద్ద సంచలన విజయాన్ని అందుకుంది. ఇప్పుడు అదే కాంబినేషన్‌లో వస్తున్న ఉస్తాద్ భగత్‌సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో పవన్ మరోసారి పవర్‌ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించనున్నారు. శ్రీలీల, రాశీఖన్నా కథానాయికలుగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్‌కు అభిమానుల నుంచి మంచి స్పందన లభించింది. ఉగాది కానుకగా మార్చి 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆంధ్రప్రదేశ్‌లో తెల్లవారుజామునే బెనిఫిట్ షోలు కూడా ప్రదర్శించనున్నారు.

మరోవైపు రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన ధురంధర్ ది రివెంజ్ కూడా అదే రోజు విడుదల కానుంది. హిందీలో విడుదలైన మొదటి భాగం ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సంచలన విజయం అందుకుంది. ఇప్పుడు ఆ కథకు కొనసాగింపుగా రూపొందిన ఈ సీక్వెల్‌ను పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేస్తున్నారు.

ఈ సినిమాలో జస్కిరాత్ సింగ్ రాంగి అలియాస్ హమ్జా అలీ పాత్రలో రణ్‌వీర్ సింగ్ నటిస్తున్నారు. భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్రలో మాధవన్ కనిపించనున్నారు. మొదటి భాగంలో మిగిలిన అనేక ప్రశ్నలకు ఈ సీక్వెల్‌లో సమాధానాలు లభించనున్నాయి. రెండు భారీ సినిమాలు ఒకే రోజు విడుదల కావడంతో ఈ ఉగాది బాక్సాఫీస్ పోరు ఆసక్తికరంగా మారింది.

Sponsored