హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పెళ్లికి నిరాకరించిందన్న కోపంతో ఓ యువకుడు యువతికి హెచ్ఐవీ ఉన్న రక్తాన్ని ఇంజెక్షన్ ద్వారా ఎక్కించినట్లు ఆరోపణలు వచ్చాయి. నిందితుడు మనోహర్‌తో బాధితురాలికి గతంలో వివాహం నిశ్చయమైంది. అయితే అతడికి హెచ్ఐవీ ఉందని తెలుసుకున్న తర్వాత ఆమె పెళ్లికి నిరాకరించింది. దీంతో ఈ నెల 11న ఇంటికి వెళ్లి ఒత్తిడి చేసి, నిరాకరించడంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు.
పెళ్లికి నిరాకరించిందని దారుణం.. యువతికి హెచ్ఐవీ రక్తం ఇంజెక్ట్ చేసిన యువకుడు
6
Published on: 📅 14 Mar 2026, 03:38 PM
Reporter: 🖊 Suresh Reddy