భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సహకారం మరింత బలపడుతోంది. త్వరలోనే క్రిటికల్ మినరల్స్ ఒప్పందం కుదరనున్నట్లు భారత్‌లోని అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. ఇండియాటుడే కాంక్లేవ్ 2026లో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆర్థిక వృద్ధి, జాతీయ భద్రత కోసం ఈ ఖనిజాల సరఫరా గొలుసులు కీలకమని పేర్కొన్నారు. అధునాతన తయారీ, ఇంధన వ్యవస్థలు, సాంకేతిక అభివృద్ధిలో వీటి వినియోగం పెరుగుతుందని చెప్పారు. ఈ ఒప్పందంతో ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నారు.
భారత్-అమెరికా కీలక ఒప్పందం దిశగా అడుగు.. క్రిటికల్ మినరల్స్‌పై డీల్ త్వరలో
5
Published on: 📅 13 Mar 2026, 03:35 PM
Reporter: 🖊 Kiran Rao