నటి హన్సిక తన భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ చర్చనీయాంశమైంది. నాలుగేళ్ల వివాహబంధానికి ముగింపు పలికిన అనంతరం ఆమె ‘చార్దీ కలా’ అనే పంజాబీ పదాన్ని ప్రస్తావించారు. ఎప్పుడూ ఉత్సాహంగా ముందుకు సాగాలని, ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆశను కోల్పోవద్దనే అర్థం దీనికి ఉందని పేర్కొన్నారు. ఈ సందేశం ద్వారా జీవితంలో ఏ పరిస్థితి వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని అభిమానులకు హన్సిక సూచించినట్లు భావిస్తున్నారు. ఆమె పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
విడాకుల తర్వాత హన్సిక పోస్ట్ వైరల్.. ‘చార్దీ కలా’ అంటూ సందేశం
4
Published on: 📅 13 Mar 2026, 12:46 PM
Reporter: 🖊 Anitha Sharma