40 years of swathi muthyam  a timeless telugu classic

40 ఏళ్ల ‘స్వాతిముత్యం’.. తెలుగు సినిమాకు చిరస్థాయి క్లాసిక్

3

Published on: 📅 13 Mar 2026, 10:33 AM
Reporter: 🖊 Anitha Sharma

కె. విశ్వనాథ్ దర్శకత్వంలో కమల్ హాసన్, రాధిక ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘స్వాతిముత్యం’ విడుదలై నేటికి 40 ఏళ్లు పూర్తయ్యాయి. 1986 మార్చి 13న విడుదలైన ఈ చిత్రం తన కథ, భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం, మూడు నంది అవార్డులు సాధించింది. ఆస్కార్‌కు ఎంట్రీ పొందిన తొలి దక్షిణాది చిత్రంగా కూడా నిలిచింది. ఇళయరాజా సంగీతం, కమల్ హాసన్ నటన సినిమాను చిరస్థాయి క్లాసిక్‌గా నిలిపాయి. ఈ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉంది.

Sponsored