పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరగడంతో టీ20 ప్రపంచకప్ కోసం భారత్‌కు వచ్చిన కొన్ని జట్లు స్వదేశాలకు వెళ్లడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. వెస్టిండీస్, దక్షిణాఫ్రికా ఆటగాళ్లు కొన్ని రోజులు కోల్‌కతాలో చిక్కుకుపోయారు. కీలక వాయు మార్గాలు మూసివేయడంతో విదేశీ ఆటగాళ్ల ప్రయాణంపై అనిశ్చితి నెలకొంది. ఈ పరిస్థితులు 2026 ఐపీఎల్‌పై కూడా ప్రభావం చూపవచ్చని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఐపీఎల్ షెడ్యూలు ప్రకారమే ప్రారంభమవుతుందని బీసీసీఐ స్పష్టం చేసింది. పరిస్థితులను బోర్డు నిరంతరం పర్యవేక్షిస్తోందని అధికారులు తెలిపారు.
ఐపీఎల్ 2026కు యుద్ధ ప్రభావం? విదేశీ ఆటగాళ్ల రాకపై టెన్షన్
10
Published on: 📅 13 Mar 2026, 08:04 AM
Reporter: 🖊 Kiran Rao