టీ20 వరల్డ్ కప్‌లో భారత్ తమకు అనుకూలంగా పిచ్‌లు తయారుచేసుకుందనే ఆరోపణలను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమాద్ వసీమ్ ఖండించారు. ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లు తయారుచేసుకున్నారని లేదా అంపైర్లు వారికి అనుకూలంగా వ్యవహరించారని చాలామంది అంటారని చెప్పారు. అయితే ఈ టోర్నీలో పిచ్‌లు చాలా సమతుల్యంగా ఉన్నాయని వ్యాఖ్యానించారు. కొన్నిసార్లు పరిస్థితులు భారత్‌కు ప్రతికూలంగా ఉన్నా వారు అద్భుతంగా ఆడారని పేర్కొన్నారు. మొత్తం మీద భారత్ తమకంటే చాలా మెరుగ్గా ఆడిందని ఇమాద్ ప్రశంసించారు.
ఇండియా ఫ్రెండ్లీ పిచ్‌లే కావు: ఇమాద్ వసీమ్
3
Published on: 📅 11 Mar 2026, 12:43 PM
Reporter: 🖊 Anitha Sharma