gulf nations warn against sharing war content

యుద్ధ వీడియోలు షేర్ చేస్తే అరెస్ట్

1

Published on: 📅 10 Mar 2026, 03:39 PM
Reporter: 🖊 Kiran Rao

సౌదీ అరేబియాలో ఎయిర్ కండీషనర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఏపీ మదనపల్లెకు చెందిన యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అనధికార యుద్ధ సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడమే కారణమని అధికారులు తెలిపారు. ఖతర్‌లో కూడా యుద్ధానికి సంబంధించిన వీడియోలు చిత్రీకరించడం, అనధికార సమాచారాన్ని ఫార్వర్డ్ చేయడం కేసుల్లో 313 మందిని అరెస్ట్ చేశారు. యూఏఈలో కూడా యుద్ధ విజువల్స్ రికార్డ్ చేయడం లేదా షేర్ చేయడం నేరంగా పరిగణిస్తారు. ఇందుకు 1–2 సంవత్సరాల వరకు జైలుశిక్ష విధించే అవకాశం ఉంది.

Sponsored