సెంచూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ అద్భుత సెంచరీతో జట్టుకు ఘన విజయం అందించాడు. కేవలం 43 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన డికాక్, 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లను ఊచకోత కోశాడు. 49 బంతుల్లో 115 పరుగులు చేసిన డికాక్‌కు రికెల్టన్ (36 బంతుల్లో 77*) చక్కని సహకారం అందించాడు. 222 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 17.3 ఓవర్లలోనే ఛేదించింది. వెస్టిండీస్ తరఫున హెట్మయర్, రూథర్‌ఫర్డ్ రాణించారు.