టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచిన అతను రెండు స్థానాలు మెరుగుపరుచుకున్నాడు. గత దశాబ్దంలో చాలా వరకు టాప్-10లో ఉన్నాడు. నంబర్‌వన్ ర్యాంకు సాధించడం 38 ఏళ్ల రోహిత్‌కు ఇదే తొలిసారి. కోహ్లీ (6వ), శ్రేయాస్ అయ్యర్ (9వ) టాప్-10లో ఉన్నారు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో కుల్దీప్ యాదవ్ ఒకటో స్థానంలో ఉన్నాడు. ఆల్‌రౌండర్ల జాబితాలో అక్షర్ పటేల్‌కు 8వ స్థానం దక్కింది.