కొనసాగుతూనే

కొనసాగుతూనే ఉంటుంది.. బాహుబలి ప్రయాణం!

Published on: 30-10-2025

ఇది 'బాహుబలి: ది బిగినింగ్' విడుదల పదేళ్లు అవుతున్న సందర్భంగా వచ్చిన ఆలోచన. 2015లో మొదటి భాగం విడుదలైంది కదా, 2025లో ఆ సినిమాను మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తే ఎలా ఉంటుందని అనుకున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు రాజమౌళికి చెబితే, ఆయన 'రెండు భాగాల్ని కలిపి ఒకే సినిమాగా విడుదల చేద్దాం, ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని ఇవ్వగలుగుతాం' అన్నారు. రాజమౌళి సమయం దొరకదేమోనని అడిగితే, 'ఎలాగైనా కొంచెం సమయం తీసుకుని చేద్దాం' అని ఈ ప్రయత్నానికి పచ్చజెండా ఊపారు. అలా ఎడిట్ చేయించి ఈ సినిమాను సిద్ధం చేశారు.

Sponsored