పర్వతూరు, నూజివీడు: కృష్ణా జిల్లా పర్వతూరులో వరదల్లో చిక్కుకున్న 20 మందిని అధికారులు రక్షించారు. మంగళవారం సాయంత్రం పర్వతూరుతోపాటు, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 20 మంది పర్వతూరు-గుంటూరు రహదారిలోని వంతెన వద్ద ఉన్న ఒక ప్రార్థనా మందిరానికి వెళ్లారు. బుధవారం వరదనీరు ఆ మందిరాన్ని చుట్టుముట్టింది. బాధితుల బంధువుల ద్వారా విషయం తెలుసుకున్న రెవెన్యూ, పోలీసులు, పంచాయతీ అధికారులు వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. తహసీల్దార్ పి. బ్రహ్మయ్య, ఇతర అధికారులు వారిని స్వగ్రామాలకు తరలించే ఏర్పాట్లు చేశారు.