తుపానును

తుపానును సమర్థంగా ఎదుర్కొన్నాం

Published on: 30-10-2025

కాకినాడ, అమలాపురం: పూర్వ అనుభవానికి తోడు, సాంకేతికత, నిరంతర పర్యవేక్షణతో పెను తుపాను నుండి రాష్ట్రాన్ని రక్షించగలిగామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించగలిగామన్నారు. 1996 తుపానుతో పోలిస్తే, ప్రస్తుత తుపాను నష్టాన్ని నివారించామని చెప్పారు. బుధవారం తుపాను ప్రభావిత జిల్లాల్లో ఏరియల్ సర్వే చేసిన అనంతరం, కోనసీమ జిల్లా ఉడలరేవులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని సీఎం పరిశీలించారు. బాధిత కుటుంబాలకు 50 కిలోల చొప్పున బియ్యం అందిస్తామని ప్రకటించారు.

Sponsored