వర్షాల కారణంగా రోడ్లపై పేరుకుపోయిన బురదను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేశ్ సూచించారు. ఆయన జిల్లా అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 'రానున్న 48 గంటలపాటు అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తును పునరుద్ధరించాలి. వరదలకు దెబ్బతిన్న పంట నష్టం అంచనాలు రూపొందించాలి' అని ఆదేశించారు. 'వర్షాలు దెబ్బతిత్తున్న చెరువులు, వంతెనలు పర్యవేక్షించాలి. పాము కాటుకు మందు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచాలి' అని లోకేశ్ అధికారులకు సూచించారు.