తుపాను ప్రభావం ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా ఉంది. హైదరాబాద్ సహా ఇతర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. వరి కోతల సమయం కావడం వలన పంట నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలించాలని ఆదేశించారు.