ఖమ్మం జిల్లాలో మున్నేరు నదికి భారీ వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం నీటిమట్టం 24.7 అడుగులకు చేరింది. మున్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో, ఖమ్మం-జనగామ ప్రధాన రహదారిపై వరద నీరు చేరింది. ఖమ్మం సమీపంలోని దుసలపూరం వద్ద రహదారిపై మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో పోలీసులు ఆ మార్గంలో రాకపోకలను నిలిపివేశారు.ఖమ్మం నగరంలోని రామకృష్ణపురం సమీపంలో ఉన్న లో లెవల్ వంతెనపై కూడా వరద ప్రవహిస్తోంది. దీని కారణంగా ఆ ప్రాంతంలోని కొన్ని ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.