శంషాబాద్ మండలంలోని చిన్నగోల్కొండ, పెద్దగోల్కొండల వద్ద ఉన్న అండర్‌పాస్‌లోకి బుధవారం భారీగా వర్షపు నీరు చేరింది. అందులో ప్రయాణిస్తున్న ఒక ఆర్టీసీ బస్సు చిక్కుకుంది. ఉదయం నాగిరెడ్డిపల్లి నుంచి 15 మంది పాఠశాల విద్యార్థులు, ఇతర ప్రయాణికులతో శంషాబాద్ వైపు వెళ్తున్న ఈ బస్సును డ్రైవర్ నీటిలో నడిపించడంతో అది నిలిచిపోయింది. వెంటనే స్థానికులు స్పందించి, చిన్నారులను సురక్షితంగా బయటకు తీసి, మరో వాహనంలో వారిని పాఠశాలలకు పంపారు.అనంతరం, బస్సులోని మిగతా ప్రయాణికులను కూడా సురక్షిత ప్రాంతానికి తరలించారు. అండర్‌పాస్ వద్ద సహాయక చర్యలు పూర్తయ్యే వరకు రాకపోకలను నిలిపివేశారు.