ప్రో కబడ్డీ సీజన్-12లో బెంగళూరు బుల్స్ టాప్-4లో చోటు దక్కించుకుంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు గుజరాత్ జెయింట్స్‌ను $54-26$ తేడాతో ఓడించింది. అటాకింగ్, డిఫెన్స్‌లో అదరగొట్టిన బెంగళూరు లీగ్ దశను 22 పాయింట్లతో మూడో స్థానంలో ముగించింది. పుణెరి పల్టన్ (26), దబాంగ్ ఢిల్లీ (26), తెలుగు టైటాన్స్ (20) వరుసగా ఒకటి, రెండు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. హరియాణా స్టీలర్స్, ముంబా, జైపూర్ కూడా ప్లేఆఫ్‌కు చేరాయి.