whatsapp launches parentmanaged accounts for kids

పిల్లల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్

34

Published on: 📅 12 Mar 2026, 04:30 PM
Reporter: 🖊 Anitha Sharma

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ 13 ఏళ్లలోపు పిల్లల కోసం కొత్త పేరెంట్-మేనేజ్డ్ మోడల్ను తీసుకొచ్చింది. ఈ ఖాతాలను తల్లిదండ్రులు లేదా గార్డియన్లు సెటప్ చేసి నియంత్రించగలిగేలా రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. పిల్లల అకౌంట్ తల్లిదండ్రుల అకౌంట్‌తో లింక్ అయి ఉంటుంది. ఈ ఖాతాల్లో పిల్లలు కేవలం మెసేజింగ్, కాలింగ్ మాత్రమే చేయగలరు. ఛానెల్స్, స్టేటస్, లొకేషన్ షేరింగ్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉండవు. ఎవరితో కాంటాక్ట్ కావాలి, ఏ గ్రూప్‌లో చేరాలి అనే విషయాలను కూడా తల్లిదండ్రులే నియంత్రిస్తారు.

Sponsored