న్యాయస్థానాలు ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేవని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో నిర్మించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పీఐఎల్ (PIL)పై విచారణ సందర్భంగా ఈ తీర్పునిచ్చింది. పీపీపీ విధానంలో కళాశాలలు నిర్మిస్తే తప్పేంటని కోర్టు ప్రశ్నించింది. పూర్తిగా ప్రైవేట్‌కు అప్పగించకుండా ప్రభుత్వ భాగస్వామ్యం ఉండటం మంచిదే కదా అని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది.