తెలంగాణలో

తెలంగాణలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రారంభం

Published on: 09-10-2025

తెలంగాణలో మొదటి విడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమైంది. మొదటి విడతలో 292 జడ్పీటీసీ, 2,964 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులు ఈ నెల 11 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. రాష్ట్ర ఎన్నికల సంఘం మొత్తం ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనుంది. తొలి రెండు దశల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరుగుతాయి. మిగతా మూడు దశల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు.

Sponsored