గ్రీన్‌లాండ్ అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పందించారు. గ్రీన్‌లాండ్‌పై తమ నిర్ణయం పూర్తిగా స్పష్టమని తెలిపారు. డెన్మార్క్‌తో సులభమైన ఒప్పందం కావాలని, చర్చల ద్వారా పరిష్కారం ఆశిస్తున్నామని అన్నారు. అది సాధ్యం కాకపోతే ఇతర మార్గాలను పరిశీలించాల్సి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో అమెరికా వెనక్కి తగ్గదని స్పష్టం చేశారు. రష్యా లేదా చైనా ప్రభావం పెరగకుండా జాగ్రత్త చర్యలు అవసరమని పేర్కొన్నారు. ఈ ప్రకటన అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. శాంతియుత పరిష్కారానికే ప్రాధాన్యం ఇస్తామని అధికారులు తెలిపారు.