తూర్పు కాంగోలో భారీ విషాద ఘటన చోటుచేసుకుంది. రుబాయా ప్రాంతంలోని కొల్టాన్ గని ఒక్కసారిగా కూలిపోవడంతో 200 మందికిపైగా కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. స్మార్ట్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల్లో వినియోగించే కొల్టాన్ కోసం అక్కడ విస్తృతంగా మైనింగ్ జరుగుతోంది. ఈ గనులు రెబల్స్ నియంత్రణలో ఉండటంతో భద్రతా ఏర్పాట్లు పూర్తిగా లేవని సమాచారం. సరైన రక్షణ చర్యలు లేకపోవడంతో గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయి. ఈసారి ప్రాణనష్టం ఎక్కువగా ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. మృతుల కుటుంబాలకు సహాయం అందించాలని మానవ హక్కుల సంస్థలు కోరుతున్నాయి.