విశాఖలో

విశాఖలో దొంగల బీభత్సం.. కాళ్లు, చేతులు కట్టేసి 12 తులాల బంగారం, కారు, రూ.3లక్షల నగదు చోరీ

Published on: 📅 06 Oct 2025, 02:54

విశాఖపట్నం (మాధవధార) రెడ్డి కంచరపాలెంలో దొంగలు బీభత్సం సృష్టించి భారీ చోరీకి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి దాటాక జాతీయ రహదారి సమీపంలోని ఒక ఇంట్లోకి దుండగులు చొరబడ్డారు. ఇంట్లో ఉన్న వృద్ధురాలు, ఆమె మనవడి కాళ్లు, చేతులు కట్టేసి దోపిడీ చేశారు. 12 తులాల బంగారం, రూ.3 లక్షల నగదు, కారుతో దొంగలు ఉడాయించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, దొంగలు తీసుకెళ్లిన కారును మారికవల వద్ద గుర్తించారు. నిందితుల ఆచూకీ కోసం ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Sponsored