సీఎంగా

సీఎంగా నాకు అత్యంత సంతృప్తిని ఇచ్చిన రోజు అదే.: వైఎస్ జగన్

Published on: 📅 16 Sep 2025, 08:22

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం ఓ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. 2019 నుంచి 2024 వరకూ వైఎస్ జగన్ ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఐదేళ్ల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రారంభించారు వైఎస్ జగన్. అలాగే లబ్ధిదారులకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా సాయం అందించే ఎన్నో పథకాలను బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ముఖ్యమంత్రిగా అభివృద్ధి పనులతో పాటుగా వైసీపీ అధినేతగానూ అనేక మరపురాని విజయాలను అందుకున్నారు.

Sponsored