ఆంధ్రప్రదేశ్‌కు గూగుల్ వచ్చేస్తోంది.. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. విశాఖపట్నంకు వచ్చే నెలలో గూగుల్ రానుందని సీఎం తెలిపారు. అలాగే టీసీఎస్ కూడా విశాఖపట్నంలో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తోంది అన్నారు. అలాగే ఉమ్మడి విశాఖపట్నంజిల్లాలో ఆర్సెలార్ మిత్తల్ త్వరలో ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనుందని.. కలెక్టర్ల సమావేశంలో పరిశ్రమలు, మౌలిక సదుపాయాలపై ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు అభివృద్ధిలో పోటీ పడుతున్నాయన్నారు.
ఆ జిల్లాకు రెండు దిగ్గజ ఐటీ కంపెనీలు వస్తున్నాయి.. రూ.70వేల కోట్లతో మరో భారీ పరిశ్రమ వస్తోంది.. దశ తిరిగింది
Published on: 16-09-2025