TGSRTC

TGSRTC టూర్‌ ప్యాకేజీలు.. నాగార్జునసాగర్‌, మంత్రాలయానికి ప్రత్యేక సర్వీసులు, వివరాలివే..

Published on: 📅 23 Aug 2025, 01:56

తెలంగాణతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లను పైకి ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. దీంతో సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకోగా.. పర్యాటకులు ఆ సుందర దృశ్యాలను చూసేందుకు క్యూ కడుతున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ వెళ్లాలనుకునే పర్యాటకులకు తెలంగాణ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. సాగర్‌తో పాటు శ్రీరంగాపురం, మంత్రాలయానికి ప్రత్యేక బస్సు సర్వీసులను నడుపుతూ టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. by TaboolaSponsored Links You May Like

Sponsored