కృష్ణాజిల్లా మచిలీపట్నం రామానాయుడుపేట సెంటర్లో జనసేన పార్టీ జెండా దిమ్మ ఏర్పాటు విషయంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. జనసేన నేతలు పార్టీ జెండా ఆవిష్కరణకు సిద్ధమవుతున్న వేళ.. శాంతిభద్రతల దృష్ట్యా వైకాపా నేత పేర్ని నాని ఇంటి వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల వలయాన్ని దాటుకొని పేర్ని నాని జనసేన జెండా దిమ్మ దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయగా అధికారులు అడ్డుకున్నారు. దీంతో పేర్ని నాని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. కొద్దిసేపటి తర్వాత ఆయన కొంత వెనక్కి తగ్గినట్లు తెలిసింది.
మచిలీపట్నంలో ఉద్రిక్తత.. జనసేన జెండా దిమ్మ వద్ద పోలీస్ బందోబస్తు
3
Published on: 📅 14 Mar 2026, 03:18 PM
Reporter: 🖊 Ramesh Kumar