సినిమా టికెట్ ధరల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. టికెట్ ధరలు పెంచాలంటే సినిమా విడుదలకు 90 రోజుల ముందే ప్రభుత్వం జీవో జారీ చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ మైత్రీ మూవీ మేకర్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ అనంతరం ధర్మాసనం హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించింది. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానాన్నే కొనసాగించాలని కోర్టు సూచించడంతో విడుదలకు సిద్ధమైన సినిమాలకు ఊరట లభించింది.
సినిమా టికెట్ ధరలపై హైకోర్టు ఉత్తర్వులకు సుప్రీంకోర్టు స్టే
4
Published on: 📅 13 Mar 2026, 03:55 PM
Reporter: 🖊 Suresh Reddy