సెప్టెంబర్ రెండో వారంలో ఓవైపు థియేటర్లలో తేజ సజ్జా 'మిరాయ్', బెల్లంకొండ 'కిస్కింధపురి' కొత్త సినిమాలు రిలీజ్ అవుతుంటే.. మరోవైపు ఓటీటీలో బ్లాక్ బస్టర్ సినిమాలు, ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీసులు అలరించడానికి వస్తున్నాయి. రజనీకాంత్, నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ సాహిర్ లాంటి స్టార్స్ నటించిన 'కూలీ' సినిమా ఈ వారమే డిజిటల్ స్ట్రీమింగ్ కాబోతోంది. కన్నడ బ్లాక్ బస్టర్ 'సు ఫ్రమ్ సో'.. హిందీ హిట్మూవీ 'సైయారా' కూడా ఓటీటీలో సందడి చేయనున్నాయి. తమన్నా భాటియా నటించిన కొత్త వెబ్ సిరీస్ కూడా అలరించడానికి సిద్ధంగా ఉంది. ఏ సినిమా ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుందంటే..
Su From So OTT: ఈ వారం ఓటీటీలోకి మూడు బ్లాక్‌బస్టర్ సినిమాలు.. మిల్కీ బ్యూటీ తమన్నా వెబ్ సిరీస్ కూడా..
Published on: 09-09-2025