నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణించే వారిని దోపిడీ దొంగలు దోచుకున్నారు. ఏకంగా రైల్వే సిగ్నలింగ్ వ్యవస్థనే ట్యాంపరింగ్ చేసిన దుండగులు.. రైలు ఆగగానే అందులోకి ప్రవేశించి.. మహిళల వద్ద ఉన్న బంగారు నగలు ఎత్తుకెళ్లిపోయారు. అయితే నిజమైన బంగారం అనుకుని.. ఓ మహిళ మెడలో ఉన్న రోల్డ్ గోల్డ్ నగలను కూడా దొంగలు చోరీ చేయడం గమనార్హం. రెడ్ సిగ్నల్ వచ్చేలా చేసి.. రైలు ఆగిన తర్వాత అందులోకి చొరబడి దొంగతనాలు చేస్తున్నట్లు అధికారుల విచారణలో వెల్లడైంది.
రైల్వే ప్రయాణికులు బీ అలర్ట్.. డబ్బులు, బంగారం జాగ్రత్త..!
Published on: 📅 28 Aug 2025, 09:30