హనీట్రాప్‌లో

హనీట్రాప్‌లో ప్రముఖ యోగా గురువు.. రూ.50 లక్షలు కాజేసిన ఇద్దరు మహిళలు!

Published on: 15-09-2025

యోగా గురువును ఓ ముఠా హనీట్రాప్‌ చేసి.. లక్షలు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనారోగ్యం పేరుతో యోగా గురువు ఆశ్రమంలో చేరిన ఇద్దరు మహిళలు.. ఆయనతో సన్నిహితంగా మెలిగారు. ఆయనకు తెలియకుండానే వీడియోలు తీసి, బ్లాక్‌మెయిల్‌కు తెరతీశారు. వాటిని చూపించి, బెదిరింపులకు పాల్పడ్డారు. భయపడిపోయిన ఆ యోగా గురువు.. వారికి రూ.50 లక్షలు సమర్పించుకున్నారు.

Sponsored