కింగ్

కింగ్ మేకర్ కాదు.. నేనే గెలుస్తా’ – విజయ్ ధీమా

Published on: 📅 31 Jan 2026, 05:56

తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ చీఫ్ విజయ్ ధీమా వ్యక్తం చేశారు. తనను కింగ్ మేకర్‌గా పిలవడం ఇష్టంలేదని, కింగ్ మేకర్ అంటే ప్రధాన డ్రైవర్ కాదని, కేవలం సపోర్టర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తాను గెలవబోతున్నప్పుడు కింగ్ మేకర్ అనే పదం ఎందుకని ప్రశ్నించారు. తమ సభలకు వస్తున్న భారీ జనసమూహమే ప్రజల మద్దతుకు నిదర్శనమన్నారు. కరూర్ తొక్కిసలాట ఘటన ఇప్పటికీ తనను వెంటాడుతోందని, రాజకీయ ప్రవేశంతో తన సినిమాలకు అడ్డంకులు వస్తాయని ముందే ఊహించినట్లు తెలిపారు

Sponsored