సబల మిల్లేట్స్టై టిల్ స్పాన్సర్‌గా దక్షిణాది రాష్ట్రాల్లో తొలిసారిగా జాతీయ పీకిల్‌బాల్ పోటీలు బెంగళూరు వేదికగా జరగనున్నాయి. నవంబర్ 13 నుంచి 16 వరకు స్పోర్ట్స్ స్కూల్‌లో జరిగే ఈ పోటీల్లో 20 రాష్ట్రాల నుంచి 1400 మంది క్రీడాకారులు పాల్గొంటారు. 12 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వయస్సు గల వారికి వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తారు. అత్యధికంగా తెలంగాణ నుంచి 55 మంది పోటీపడుతున్నారు. విజేతలకు 12 లక్షల విలువైన నగదు బహుమతిని అందిస్తామని కర్ణాటక పీకిల్‌బాల్ సమాఖ్య అధ్యక్షుడు శ్రీధర్ సోమవారం తెలిపారు.