పాత

పాత వీడియోలను ఎమ్మెల్సీ నాగబాబుతో పంచుకున్న మంత్రి లోకేష్.. చర్చనీయాంశమైన సీన్

Published on: 📅 20 Sep 2025, 09:00

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాల్లో శుక్రవారం ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను పీపీపీ కింద అప్పగించడంపై నిరసన వ్యక్తం చేయడంతో మండలి వాయిదా పడింది. ఈ సమయంలో జనసేన ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రి నారా లోకేష్ మధ్య చర్చ సాగింది. గత ప్రభుత్వంలో టీడీపీ ఎమ్మెల్సీల నిరసనల వీడియోలను లోకేష్ నాగబాబుకు చూపగా, ఆయన ఆసక్తిగా వీక్షించారు. వారి పక్కనే పలువురు మంత్రులు కూడా ఉన్నారు.ఈ సంఘటనతో సభలో నవ్వులు పూశాయి.

Sponsored